Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించిన ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ అవకాశాలు వరుబెట్టి వస్తున్నాయి. అయితే, హాలీవుడ్‌లో ఆమె తొలి అవకాశం ఎలా వచ్చిందో ఇపుడు బహిర్గతం చేసింది. అనుకోకుండా ఓ పార్టీకి వెళ్లడంతో అక్కడ వారు తనను చూసి హా

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (13:55 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ అవకాశాలు వరుబెట్టి వస్తున్నాయి. అయితే, హాలీవుడ్‌లో ఆమె తొలి అవకాశం ఎలా వచ్చిందో ఇపుడు బహిర్గతం చేసింది. అనుకోకుండా ఓ పార్టీకి వెళ్లడంతో అక్కడ వారు తనను చూసి హాలీవుడ్‌లో నటించే అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు.
 
అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక ఆ తర్వాత వరుసగా హాలీవుడ్‌ ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్నారు. ఈసందర్భంగా తన హాలీవుడ్‌ ప్రయాణం ఎలా మొదలైందో వివరించింది. 'హాలీవుడ్‌ ప్రయాణం చాలా భయంకరమైనది. కానీ మంచి అనుభవం. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ జిమ్మీ లొవైన్‌తో కలిసి ఆల్బమ్‌ చేయాలని నా మేనేజర్‌ సలహా ఇచ్చాడు. అలా నేను అమెరికాకు వెళ్లినట్టు చెప్పారు. 
 
అక్కడివారు నన్ను స్నేహితురాలిగా స్వీకరించారు. కాబట్టి నేనూ వారితో కనెక్ట్‌ అయ్యాను. ఆ తర్వాత అక్కడి ఈవెంట్లకు, పార్టీలకు హాజరయ్యాను. ఆ పార్టీలకు వచ్చిన వారిలో గ్రామీ అవార్డులు అందుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. నన్ను చూసి అమెరికాలో నువ్వు ఎందుకు పనిచేయకూడదు? అని అడిగారు. దాని గురించి ఆలోచించాను. అలా అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ క్వాంటికోలో నటించే అవకాశం నేను పార్టీకి వెళ్లడం ద్వారా లభించిందని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా, క్వాంటికోలో నటిస్తున్నంతసేపు నేను అమెరికన్‌ అని అక్కడివారు నమ్మేలా నటించాను. అలెక్స్‌ పాత్రలో నటించే అవకాశం ఎంతమందికి వచ్చిందో నాకు తెలీదు కానీ నా గురించి వచ్చిన రివ్యూలు మాత్రం సంతృప్తినిచ్చాయి. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని నిరూపించాయి. మా నాన్న నాకోసం హాలీవుడ్‌లో ఆఫర్లు ఉంచి వెళ్లలేదు. ఏం చేసినా నా అంతట నేనే చేయాలి. అలా ప్రయత్నిస్తుండగా డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి 'బేవాచ్'లో నటించే అవకాశం వచ్చిందని ఆమె వివరించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments