హాలీవుడ్ మూవీ కోసం భారత్‌ను వదులుకున్న ప్రియాంకా చోప్రా...
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తీవ్ర నిరాశలో కూరుకుంది. హాలీవుడ్ చిత్రాన్ని నమ్ముకుని ఓ బాలీవుడ్ భారీ ప్రాజెక్టును వదులుకుంది. తీరా షెడ్యూలింగ్ సమస్యల కారణంగా హాలీవుడ్ చిత్రం ఎపుడు సెట్స్‌పైకి వెళుతుంద
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తీవ్ర నిరాశలో కూరుకుంది. హాలీవుడ్ చిత్రాన్ని నమ్ముకుని ఓ బాలీవుడ్ భారీ ప్రాజెక్టును వదులుకుంది. తీరా షెడ్యూలింగ్ సమస్యల కారణంగా హాలీవుడ్ చిత్రం ఎపుడు సెట్స్‌పైకి వెళుతుందో ఆ చిత్ర దర్శకుడే ఓ క్లారిటీ ఇవ్వలేక పోతున్నాడు. దీంతో ప్రియాంకా చోప్రా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌కి పరిమితమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న "భారత్" అనే చిత్రంతో మళ్ళీ బాలీవుడ్‌కి తిరిగి వస్తుందని అందరు భావించారు. అయితే, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుంటున్న కారణంగా భారత్ నుండి తప్పుకుంటున్నట్టు ఆ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించారు. ఫలితంగా ప్రియాంకా స్థానంలో మరో నటి కత్రినా కైఫ్‌ను తీసుకున్నారు.
అదేసమయంలో ప్రియాంకా చోప్రా మరో హాలీవుడ్ మూవీలో సంతకం చేసింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఫేం క్రిస్ ప్రాట్‌కు జోడీగా ఆమె నటించనున్నారు. మిషెల్ మెక్ లారెన్ దర్శకత్వంలో 'కౌబాయ్ నింజా వైకింగ్' అనే పేరుతో ఓ హాలీవుడ్ మూవీ రూపొందనుంది. ఇందులో ఓ సైకో థెరపిస్ట్ ముగ్గురు ఏజెంట్‌లని వైకింగ్‌లుగా ఎలా మారుస్తాడు అన్నది చూపించనున్నారు. 2019 జూన్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ కారణంగా షూటింగ్‌ని వాయిదా వేశారట.
ప్రస్తుతం చిత్ర దర్శకుడు మిచెల్ మెక్‌లారెన్ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉండగా, సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. హాలీవుడ్ చిత్రాన్ని నమ్ముకొని భారత్‌ని వదులుకున్న ప్రియాంక ఆశలు ఆవిరయ్యాయి.