ఇప్పుడు నేను రెడీ అవడం చాలా ఈజీ... నాకు జుట్టు లేదు కదా... సోనాలి బింద్రే పోస్ట్
సోనాలీ బింద్రే అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఇంద్ర. ఈ చిత్రంతో సోనాలీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. నాగార్జున మన్మథుడు, చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలతోపాటు ఖడ్గం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్య
సోనాలీ బింద్రే అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఇంద్ర. ఈ చిత్రంతో సోనాలీ బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. నాగార్జున మన్మథుడు, చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలతోపాటు ఖడ్గం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఈ తార ప్రస్తుతం హైగ్రేడ్ క్యాన్సర్‌తో న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమెకు కీమో థెరపీ జరుగుతోంది. ఈ చికిత్స సమయంలో వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. తలపై కేశాలతోపాటు నొసలపై వున్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఇలాంటి చికిత్సను మనోధైర్యంతో ఎదుర్కొంటున్న సోనాలీ బింద్రే ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో దిగిన ఫోటోను షేర్ చేశారు.
తను ఒంటరిగా ఒత్తిడికి లోనుకాకుండా నా స్నేహితులు నన్ను ఎంతగానో అండగా వున్నారంటూ చెప్పుకున్నారు. అంతేకాకుండా తను కష్టసమయం నుంచి బయటకు రావాలంటూ ఎంతోమంది సందేశాలు పంపిస్తున్నారనీ, వారందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు. ఇకపోతే తనిప్పుడు రెడీ అవడానికి పెద్దగా టైం పట్టడంలేదనీ, ఎందుకంటే తనకు జుట్టు లేదు కదా అంటూ గుండెల్ని పిండేసే పోస్ట్ చేశారు సోనాలీ. ఆమె త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఆశిద్దాం.