Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వకీల్ సాబ్' నుంచి 'సత్యమేవ జయతే' వచ్చేసింది.. మాకు ఏమి కావాలో అదే ఇచ్చేసారు..(video)

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (18:00 IST)
Vakeel saab
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ''వకీల్ సాబ్'' సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని రెండో గీతం 'సత్యమేవ జయతే' లిరికల్ వీడియోను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. 
 
గాయకుడు శంకర్‌ మహదేవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. శంకర్‌ మహదేవన్‌, పృథ్వీ చంద్ర, తమన్‌ ఆలపించారు.
 
హిందీలో విజయవంతమైన 'పింక్‌' రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. 
SathyamevaJayathe
 
ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. పవన్‌ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన లిరికల్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏది కావాలో అదే ఇచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ లిరికల్ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments