Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ సోహైల్ కొత్త గెట‌ప్‌!

Advertiesment
Sohail
Sohail new getup
జార్జ్ రెడ్డి, ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని తన మూడవ చిత్రాన్ని బిగ్ బాస్ ఫేం సోహైల్ తో నిర్మిస్తున్నారు నిర్మాత అప్పి రెడ్డి. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు.ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, ‘‘మా మైక్ మూవీ నుండి జార్జి రెడ్డి , ప్రెషర్ కుక్కర్ వంటి మూవీస్ తీశాం. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటితో కలసి సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం`అన్నారు.
webdunia
Sohail movie opening
టెక్నీషియన్స్:
మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఆర్ట్: గాంధీ నడికుడికార్
నిర్మాతలు: అప్పిరెడ్డి,సజ్జల రవిరెడ్డి,అభిషేక్ రెడ్డి
రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాప్సీకి ఆ డైరెక్టర్ చాలా క్లోజ్? అందుకే డబ్బంతా ఆమె పేరు మీద?