స‌మంత రిలీజ్ చేసిన సీటీమార్ టైటిల్ సాంగ్‌కి రెస్పాన్స్

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:38 IST)
Seetimaarr title song
గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా `సీటీమార్` టైటిల్ సాంగ్‌ని స‌మంత అక్కినేని  రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
ట్రైల‌ర్‌లో ఏముందంటే!
`గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి ప్రొద్దు తిరుగుడు పువ్వా..మా పాపి కొండ‌ల న‌డుల రెండు జెళ్లేసిన చంద‌మామ నువ్వా..
మ‌లుపు మ‌లుపులోన గ‌ల‌గ‌ల‌పారేటి గోదారి నీ న‌వ్వా..నీ పిలువు వింటే చాలు ప‌చ్చాపచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా.
సీటీమార్..సీటీమార్..సీటీమార్..
కొట్టు కొట్టూ ఈలే కొట్టు..ప్ర‌పంచ‌మే వినేటట్టు..దించితేనే అడుగులు ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా
ఎత్తితేనే నీ త‌ల ఆకాశమందుతూ ఎగురుతావు జెండ‌లా..గెలుపే న‌డిపే బ‌ల‌మే గెలుపే క‌బ‌డ్డి క‌బ‌డ్డి క‌బడ్డి..సీటీమార్..సీటీమార్.. సీటీమార్‌`
అంటూ ఫుల్ ఎన‌ర్జిటిక్‌, ఇన్స్‌పైరింగ్‌గా సాగే ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించ‌గా మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, రేవంత్‌, వ‌రం అంతే ఎనర్జీతో ఆల‌పించారు. ఈ టైటిల్‌సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments