Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జాను'' ఫట్.. అయినా వెనక్కి తగ్గని సమంత.. జెట్ వేగంలో కొత్త సినిమా

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:08 IST)
పెళ్లికి తర్వాత సమంత భారీ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ''జాను'' సినిమా మాత్రం సమంతకు నిరాశనే మిగిల్చింది. తమిళ హిట్ చిత్రం ''96'' ఆధారంగా రూపొందిన ''జాను'' చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయినా సమంత ధైర్యంగా ముందడుగు వేసింది. లేడి ఓరియెంటెడ్ పాత్రను ఎంచుకునేందుకు సై అంటోంది. 
 
"గేమ్ ఓవర్'' ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో ప్రశాంత్ హీరోగా నటించనున్నారని తెలిసింది. అతనిది ఈ చిత్రంలో కీలక పాత్రే అయినప్పటికీ.. సమంతను మాత్రం డామినేట్ చేసేది కాదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కానీ ఈ కథ విన్న ప్రశాంత్ మాత్రం ఈ రోల్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. అన్నీ పనులు పూర్తైతే.. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments