త్రిషకు షాక్... ప్రమోషన్‌కు రాకపోతే.. పారితోషికంలో సగం కట్

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:37 IST)
Trisha
త్రిష తాజాగా నటించిన తమిళ చిత్రం పరమపదం విలయాట్టు. ఈ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో సినీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై సినీ నిర్మాతల మండలి ఫైర్ అయ్యింది. త్రిష ఈ సినిమాలో నటించి ప్రమోషన్ చేయడానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే.. త్రిష తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని హెచ్చరించింది. 
 
కాగా, 24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తిరుజ్ఞానం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరమపద విళైయాట్టు సినిమాలో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రబృందం చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించింది. 
 
అయితే ఈ కార్యక్రమానికి నటి త్రిష హాజరు కాలేదు. ప్రధాన పాత్రలో నటిస్తోన్న త్రిషనే ఈ ప్రచారకార్యక్రమంలో పాల్గొనకపోవడంతో చిత్ర బృందం ఆవేదనకు గురైంది. దీంతో ప్రమోషన్‌కు త్రిష రాకపోతే.. త్రిష పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని యూనిట్ హెచ్చరించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరేనా? క్రాక్ టీజర్