Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే ఆయన రిలీజ్ చేశ

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:34 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే ఆయన రిలీజ్ చేశారు. ఇపుడు నటీనటుల ఎంపికపై ఆర్జీవీ దృష్టిసారించనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్‌తో చేయించాలనే తలంపులో వర్మ వున్నట్టు సమాచారం. ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు .. హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువల్ల ఆయనైతే ఎన్టీఆర్ పాత్రకి కరెక్ట్‌గా సెట్ అవుతాడని వర్మ భావిస్తున్నాడట. 
 
ప్రకాశ్ రాజ్‌తో సంప్రదింపులు జరపడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఇది నిజమే అయితే .. వివాద స్పదమైన ఈ సినిమాలో నటించడానికి ప్రకాశ్ రాజ్ అంగీకరిస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది. అలాగే, లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారోననే ఆత్రుత పెరుగుతోంది. 
 
కాగా, 1997 జనవరి 14వ తేదీన "ఇరువర్" అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ మరో హీరో పాత్ర పోషించారు. తమిళ మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్‌ స్నేహం, రాజకీయ వైరాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కరుణానిధి పాత్రను తమిళ్ సెల్వన్ పేరుతో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments