Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హల్లో.. నేను చిన్నమ్మను... సీఎం ఎడప్పాడికి శశికళ ఫోన్...

అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్‌ను చూసేందుకు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఫోన్ చేశారు.

హల్లో.. నేను చిన్నమ్మను... సీఎం ఎడప్పాడికి శశికళ ఫోన్...
, మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:33 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్‌ను చూసేందుకు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఫోన్ చేశారు. తన బంధువు ఇళవరసి కుమారుడు ఫోన్ నుంచి ఆమె సీఎంకు ఫోన్ చేశారు. ఈ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి.. శశికళకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. హల్లో.. నేను చిన్నమ్మ శశికళను మాట్లాడుతున్నాను అంటూ పేరు చెప్పుకుని పరిచయం చేసుకున్నా ముఖ్యమంత్రి స్పందించలేదు. దీంతో చిన్నమ్మ ముఖం చిన్నబోయింది. 
 
మరోవైపు శశికళపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా వర్గాలు డేగ కన్ను వేసి వున్నాయి. ఆమెను ఎవరెవరు కలుస్తున్నారు.. ఎందుకు కలుస్తున్నారు? అలాగే, శశశికళ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఫోనులో మాట్లాడుతున్నారా? వంటి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా శశికళ జైలు నుంచి బయటకు వచ్చాక, చెన్నైకు చేరుకున్న రాత్రే ఆమె తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను రహస్యంగా పిలిపించుకుని మాట్లాడినట్టు ఓ ప్రచారం కావడంతో నిఘా వర్గాలు డేగ కన్నుతో పహారా కాస్తున్నాయి.
 
ఇంకోవైపు అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు వచ్చినట్టు చెప్పుకుంటున్న శశికళ... ఆస్పత్రికి నామమాత్రంగా వెళుతున్నారేగానీ, ఆమె పగలు రాత్రిళ్లు రాజకీయాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా.. అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం, జయలలిత ఇంటికి స్మారక మందిరంగా మార్చడం, అమ్మ మృతిపై న్యాయ విచారణ జరిపించడం, ఎడప్పాడి, పళనిస్వామిలు చేతులు కలపడం వంటి అంశాలపైనే ఆమె రహస్యంగా మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షా కుమారుడి కంపెనీ వృద్ధిరేటు 16 వేల రెట్లు