Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నమ్మకు పెరోల్ తిరస్కరణ... చావుబతుకుల మధ్య భర్త.. ఎలా?

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చుక్కెదురైంది. విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు

చిన్నమ్మకు పెరోల్ తిరస్కరణ... చావుబతుకుల మధ్య భర్త.. ఎలా?
, బుధవారం, 4 అక్టోబరు 2017 (05:58 IST)
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చుక్కెదురైంది. విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్‌ను జైలు అధికారులు తిరస్కరించారు. 
 
కాలేయ, మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన తన భర్తను చూసే నిమిత్తం పదిహేను రోజుల పాటు పెరోల్ ఇవ్వాల్సిందిగా తన దరఖాస్తులో శశికళ కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జైలు అధికారులు పెరోల్ ఇచ్చేందుకు తిరస్కరించారు. కాగా, అక్రమాస్తుల కేసులో గత ఫిబ్రవరి నుంచి శశికళ సహా ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. 
 
చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్‌ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్‌, ఇతర ఇంటెన్సివ్‌ కేర్‌ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన వైద్య బులిటెన్‌లో వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఒక్క పిలుపుతో రెబల్ ఫ్యాన్స్ విజయవంతం చేశారు...