Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ సినిమా..

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:43 IST)
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ అనే సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. 
 
అంతేకాకుండా ఈ రెండు సినిమాల తరవాత ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మరోవైపు ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ 25 గురించి ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
ఈ సినిమాకు టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. సందీప్ అర్జున్ రెడ్డి తరవాత అదే కతను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. 
 
అంతే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్‌తో యానిమల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా కన్ఫామ్ అయితే నాగ్ అశ్విన్‌తో సినిమా తరవాత సందీప్‌తో తెరకెక్కే సినిమా షురూ కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments