రామాయణం వంటి ఇతిహాస కథకు ఇప్పటి సొగసులు అద్దుతూ రూపొందిస్తున్న సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్ ఆలస్యమైంది. అంతకుముందు ముంబై వేసిన సెట్ కూడా కాలిపోయింది. కొన్ని అవాంతరాల తర్వాత మరలా సెట్‌పైకి వెళ్ళనుంది. ఈ కథకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కాగా, ఈ సినిమా విడుదల తేదీని సోమవారంనాడు చిత్ర యూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆగష్టు 11న 2022 గా వెల్లడించింది. శాస్త్ర ప్రకారం ఆరోజు శివుడికి ప్రత్యేకమైన రోజు. ఏది ఏమైనా ఆ తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేయాలని దర్శకుడు దర్శకుడు ఓం రౌత్ సన్నాహాలు చేస్తున్నాడు. సినిమా 3డిలో విడుదల కానుంది. కాబట్టి షూటింగ్ కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తీయనున్నట్లు తెలుస్తోంది.