Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ వాకిట్లో లంబోర్గిని కారు.. హ్యాపీగా చుట్టేసిన ప్రసీధ, శ్యామలమ్మ !!

Prabhas
Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:51 IST)
Prabhas
టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనేస్తుంటాడు. పాన్ ఇండియాగా మారిన ప్రభాస్ ప్రస్తుతం ఓ సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ జులైలో విడుదల కానుంది. సలార్ 2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది. అది వచ్చిన నాలుగు నెలల్లోనే ఆది పురుష్ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా 2024 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ కావడంతో ముంబైలోనే ఇల్లు తీసుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్‌. అందుకే అక్కడే 50 కోట్లకు పైగా ఖర్చు చేసి ఓ భారీ విల్లా కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నాడు. మరోవైపు ఇప్పుడు కొత్త కారు కూడా తీసుకున్నాడు ప్రభాస్. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసాడు. 
 
రెండు వారాల కిందే ఈ కారు ప్రభాస్ వాకిట్లోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే కంపెనీ కారును ఈ మధ్యే కొన్నాడు. ఇప్పుడు ప్రభాస్ అంతకంటే మోడ్రన్ కారు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 
 
ఈ కారు ధర దాదాపు 7 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ కారులో ప్రభాస్ చెల్లి ప్రసీధ సిటీ చుట్టేసింది. ఆయన ఆంటీ శ్యామల కూడా ఈ కారులో ఊరంతా షికారు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments