Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న బాహుబలి - దేవసేన? 23న ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త!

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (10:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోహీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క. వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత దీనిపై వీరిద్దరూ ఓ స్పష్టత ఇచ్చారు. కానీ, ఇపుడు మళ్లీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నిజానికి ప్రభాస్ పెళ్లిపై కొన్నాళ్ళుగా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతోంది. అనుష్క శెట్టితో ప్ర‌భాస్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేయగా, మరి కొంద‌రు ఆంధ్రా అమ్మాయిని వివాహం చేసుకుంటాడ‌ని అన్నారు. ప్ర‌భాస్ పెళ్ళికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికారు చేయ‌గా, వీటిని ప్ర‌భాస్ కుటుంబ స‌భ్యులు ఖండించారు. 
 
అయితే ఇప్పుడు ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లి మేట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాము మొద‌టి నుండి స్నేహితుల‌మ‌నే చెబుతున్న కూడా ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లికి సంబంధించిన వార్త‌ల‌కి బ్రేక్ అనేదే ప‌డ‌డం లేదు. కొన్నాళ్ళు సినిమాల‌కి దూరంగా ఉంటున్న అనుష్క రీసెంట్‌గా ఇట‌లీ వెళ్ళింద‌ని, అక్క‌డ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ని క‌లిసింద‌నే ఓ వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది. 
 
ఈనెల 23వ తేదీన ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు ఇద్దరు క‌లిసి అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. జాతీయ మీడియా సైతం అనుష్క ఇట‌లీ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. అక్టోబ‌రు 23వ తేదీన ఇట‌లీలో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొంది. మ‌రి 'బాహుబ‌లి' జంట ఒక్క‌టి కానున్నార‌ని వ‌స్తున్న ఈ ఊహాగానాల‌లో నిజ‌మెంత ఉందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments