Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కి ప్రభాస్ డ‌బుల్ ధ‌మ‌కా

Advertiesment
పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కి ప్రభాస్ డ‌బుల్ ధ‌మ‌కా
, సోమవారం, 15 అక్టోబరు 2018 (11:41 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, త‌మిళ్, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. బాహుబలి చిత్రం తరువాత  ప్రభాస్ నటిస్తున్న సినిమా కావ‌డంతో సాహో చిత్రంపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ గురించి స‌రైన అప్‌డేట్ బ‌య‌ట‌కు రాలేదు. అందుచేత సాహో అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. 
 
ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది. అవును.. ప్రభాస్ పుట్టిన‌రోజు నాడు సాహో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సాహో అప్‌డేట్‌తో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. మరి.. ఇదే క‌నుక నిజ‌మైతే ప్రభాస్ అభిమానులకు పండగే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్‌కు ఎన్ని బంధాలో...?