Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంచ‌నాల‌ను పెంచేస్తోన్న నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి టీజ‌ర్..!

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్‌గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి.

Advertiesment
అంచ‌నాల‌ను పెంచేస్తోన్న నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి టీజ‌ర్..!
, సోమవారం, 1 అక్టోబరు 2018 (19:27 IST)
నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్‌గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్థితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనగా.. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. ఈ టీజ‌ర్ చాలా రీఫ్రెషింగ్‌గా అలాగే సృజ‌నాత్మ‌కంగా ఉంది. మామూలుగా ఒక త‌ల్లి ర‌క్తం పంచుకుని పుడితే అన్నద‌మ్ములు అంటారు.. అదే ఒకే ర‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. 
 
అలాంటి అద్భుతానికి మొద‌లుని.. క‌డ‌దాకా ఉండే క‌వచాన్ని.. ఈ స‌వ్య‌సాచిలో స‌గాన్ని అంటూ చైతూ టీజ‌ర్లో చెప్పిన డైలాగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాలో ఎప్పుడూ రాని ఓ కాస్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ అద్బుతంగా ఉంది. విజువ‌ల్స్‌ను చాలా బాగా చూపించారు. స‌వ్య‌సాచి కొన్ని క‌ళ్లు చెదిరిపోయే లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు.. అవ‌న్నీ టీజ‌ర్లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాధ‌వ‌న్, భూమికా చావ్లా ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
 
మాధవన్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా టీజర్లో చిన్న క్లూ ఇచ్చారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది. 
 
నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్ మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: క‌థ, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ందూ మొండేటి, నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్ వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం), స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ ఎం, లైన్ ప్రొడ్యూస‌ర్: పిటి గిరిధ‌ర్ రావు, కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు, సిఈఓ: చిరంజీవి(చెర్రీ), సంగీతం: ఎంఎం కీర‌వాణి, ఆర్ట్: రామ‌కృష్ణ‌, సినిమాటోగ్ర‌ఫీ: యువ‌రాజ్, ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్: రామ్ ల‌క్ష్మ‌ణ్.
.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల తీర్పు-కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవం.. త్రిష