'మన్మథుడు' ఆ పని చేద్దామనుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (22:28 IST)
నాగార్జునకు పనిభారం ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఒక్క సినిమా చేయకపోయినా మదినిండా ఆలోచనలే. ఒకవైపు నిఖిల్‌ను గాడిలో పెట్టాలన్న బాధ్యత. మరోవైపు తన కెరీర్ గురించి ఆలోచన. వారసుల కెరీర్ ఒకవైపు తను నటించే సినిమాలు ఇంకోవైపు. నాగార్జున హిందీలో రణభీర్, అలియా భట్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీలో నాగార్జున చేస్తున్నాడు.
 
200 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. మరోవైపు తమిళంలో ధనుష్‌తో కలిసి ఒక మూవీకి కమిట్ అయ్యాడు. సోగ్గాడే చిన్ని నాయన తరువాత నాగ్‌ ఇండివిడ్యువల్ సినిమాలు చేయడానికి దాదాపు స్వస్తి చెప్పినట్లు కనబడుతోంది.
 
మరోవైపు దేవదాస్ సినిమా కూడా అనుకున్నంత హిట్ కాకపోవడంతో నాగ్ బాగా డీలాపడిపోయారు. అందుకే కథ విషయంలోను దర్సకుడి విషయంలోను జాగ్రత్త పడుతున్నారు నాగార్జున. అంతేకాదు సినిమా చేద్దామా వద్దా అన్న ఆలోచనలో కూడా పడిపోయారట. ఆచితూచి అడుగులు వేస్తున్న నాగార్జున సోలో హీరోగా చేయడమా లేదంటే మల్టీస్టారర్ చేయాలా అనేది తేల్చుకోలేకపోతున్నారట. ఐతే ఆధ్యాత్మిక చిత్రాలు చేస్తే ఎలా వుంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్నమయ్య లాంటి చిత్రాలు ఏడాదికి ఒక్కటి తీసినా చాలు కదూ...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments