Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ బర్త్‌డే : 4 సర్‌ప్రైజ్‌లతో ఫ్యాన్స్ ఖుషీ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (19:07 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించనున్న ప్రాజెక్టులతో తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా నాలుగు ప్రాజెక్టుల వివరాలను మూవీ మేకర్స్ వెల్లడించారు. 
 
తొలుత "భీమ్లా నాయక్" నుంచి టైటిల్ సాంగ్ విడుదల కాగా.. అనంతరం "హరిహర వీరమల్లు" సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
 
అంటే జనవరి నెల సంక్రాంతి బరిలో 'భీమ్లానాయక్'‌ను రిలీజ్ చేసి, ఏప్రిల్‌ నెలలో వేసవి కానుకగా హరిహర వీరమల్లు మూవీస్‌తో మూడు నెలల తేడాతో పవన్ తన అభిమానులను అలరించనున్నారు.
 
అంతేకాకుండా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. సదరు పోస్టర్‌లో ‘యథా కాలం… తథా వ్యవహారం’ అంటూ రాసుకొచ్చారు. 
 
అంతే కాదు ఈ పోస్టర్‌లో హైటెక్ సిటీతో పాటు గన్ కూడా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు.
 
మరోవైపు, గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కానుంది. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments