Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైన! సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే.. జిగేల్ రాణి

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (17:01 IST)
తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన్ పూజా హెగ్డే తెలుగు సినీ ప్రేక్షకులను ఆకాశానికెత్తేసింది. ఎవరైనా సరే తెలుగు సినీ ప్రేక్షకుల తర్వాతేనంటూ చెప్పుకొచ్చారు. పైగా, వారికి ఓ సినిమా విడుదలవుతుందంటే.. ఓ పండగేనని వ్యాఖ్యానించింది. 
 
అతికొద్దికాలంలో అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ హీరోయిన్‌గా ఉంది. స్టార్‌ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తోంది. 
 
ఒకవైపు టాలీవుడ్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు మూవీ లవర్స్‌ గురించి ఓ ఉత్తరాది వ్యక్తి దగ్గర ఆకాశానికెత్తేసింది. పూజాహెగ్డే మాటలు విని షాకవడం ఎదుటి వ్యక్తి వంతైంది. 
 
ఇంతకీ తెలుగు ప్రేక్షకుల గురించి పూజా ఏం మాట్లాడిదంటే... 'తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. స్టార్స్‌ను దేవుళ్లుగా పూజిస్తారు. ఓ తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో రూ.150 కోట్లు, రూ.200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయంటే కారణం ప్రేక్షకులే. 
 
ఓ సినిమాను చాలా ఇష్టపడి పదేపదే చూస్తారు. సినిమాను, స్టార్స్‌ను ఎంతగా ప్రేమిస్తారంటే థియేటర్‌కు పెద్ద పెద్ద డ్రమ్స్‌తో వస్తారు. డాన్సులేస్తారు. పేపర్లు చల్లుతారు. సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే' అని టకటకా చెప్పుకొచ్చింది. 
 
పైగా, నటిగా తనని తాను నిరూపించుకోవడానికి, తెలియని విషయాలను తెలుసుకోవడానికి టాలీవుడ్‌ ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పి తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పూజా హెగ్డే వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments