Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బడులు తెరిచారు... 'స్థానికం'కు వచ్చిన ఇబ్బందేంటి : ఆర్ఆర్ఆర్

బడులు తెరిచారు... 'స్థానికం'కు వచ్చిన ఇబ్బందేంటి : ఆర్ఆర్ఆర్
, బుధవారం, 4 నవంబరు 2020 (16:33 IST)
వైకాపాకు చెందిన అసంతృప్తి ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) మరోమారు సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పాఠశాలలను తెరిచినప్పుడు... స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచినప్పుడు కరోనా నిబంధనలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ఉన్నంత వరకు ఎన్నికలను నిర్వహించేందుకు తమ వైసీపీ ప్రభుత్వం ఆసక్తి చూపదని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరగవనే భయం మా పార్టీలో ఉందని చెప్పారు.
 
దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని... ఏపీలో ఎన్నికలకు అభ్యంతరం ఎందుకని రఘురాజు ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎన్నికల సంఘానికి సహకరించాలని చెప్పారు. కోర్టులతో పదేపదే మొట్టికాయలు వేయించుకోవద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నదానిపై స్పష్టత తీసుకోవాలని సూచించారు. 
 
ప్రకృతి కూడా కొన్ని కొన్ని దుష్టశక్తుల్ని ఒకసారి ప్రొత్సహించదని అనటానికి ఉదాహరణగా పడిపోయిన డేరాల ఫోటోను ఎంపీ రఘురామ కృష్ణం రాజు చూపించారు. పడిపోయిన డేరాలు ఏంటంటే... మూడు రాజధానులు కావాలని ఆటో పెయిడ్ ఆర్టిస్టుల కోసం నిర్మించిన డేరాలని.. ఆ డేరాలు కూలిపోయాయని అన్నారు. 
 
నిజమైన రైతులు రాజధాని అమరావతి కోసం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో.. అక్కడ చిన్న గడ్డిపరక కూడా చెక్కు చెదరలేదని రాఘురామ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి న్యాయం ఎటువైపు ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రకృతికి మించిన శక్తి లేదని, ప్రకృతి ఏం చెప్పిందన్నది గహించాలన్నారు.

అంతేకాకుండా, రాష్ట్రంలో పాఠశాలలను తెరిచినప్పుడు... స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచినప్పుడు కరోనా నిబంధనలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ఉన్నంత వరకు ఎన్నికలను నిర్వహించేందుకు తమ వైసీపీ ప్రభుత్వం ఆసక్తి చూపదని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరగవనే భయం మా పార్టీలో ఉందని చెప్పారు.
 
దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని... ఏపీలో ఎన్నికలకు అభ్యంతరం ఎందుకని రఘురాజు ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎన్నికల సంఘానికి సహకరించాలని చెప్పారు. 
 
కోర్టులతో పదేపదే మొట్టికాయలు వేయించుకోవద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నదానిపై స్పష్టత తీసుకోవాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరాలు తెగే ఉత్కంఠ : నువ్వానేనా అంటున్న బైడెన్ వర్సెస్ ట్రంప్