Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరాలు తెగే ఉత్కంఠ : నువ్వానేనా అంటున్న బైడెన్ వర్సెస్ ట్రంప్

Advertiesment
US Election 2020 Results LIVE Updates
, బుధవారం, 4 నవంబరు 2020 (14:45 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోభాగంగా ఫలితాలు బుధవారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. 
 
ఈ ఫలితాల్లో తొలుత ఆధిక్యం ప్రదర్శించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తర్వాత వెనుకబడ్డారు. కానీ, వెనుకంజలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా పుంజుకున్నారు. 
 
అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే కీలకమైన ఫ్లోరిడాలో కూడా ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. అటు అధ్యక్ష అభ్యర్థి భవిత్యాన్ని తేల్చే స్వింగ్ స్టేట్స్‌లో చాలా వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మరోసారి ట్రంప్ స్వింగ్ కింగ్‌గా మారబోతున్నారు. 
 
2016లో కూడా కీలకమై ఏడు స్వింగ్ రాష్ట్రాలే ఆయనను అధ్యక్ష పీఠం ఎక్కించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ కంటే 30 లక్షల దాకా ఓట్లు ఎక్కువగా వచ్చాయి.. కానీ స్వింగ్ స్టేట్స్ ఫలితం పుణ్యమాని ట్రంప్‌కు ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ అధ్యక్షుడయ్యారు. 
 
అలాగే, ఈ దఫా కూడా ఆయన స్వింగ్ స్టేట్స్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత స్వింగ్ స్టేట్స్‌లోనే ఎక్కువగా ప్రచారం చేశారు. అప్పటివరకు ఆ రాష్ట్రాల్లో బైడెన్‌దే పైచేయి అన్నట్టుగా సర్వేలు తేల్చిచెప్పినా.. ట్రంప్ ప్రచారంతో హోరాహోరీగా పోరు సాగింది.. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ట్రంప్‌ హవా నడుస్తోంది. 
 
జోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, మిన్నెసోటా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఓహియో, విస్కాన్సిస్ రాష్ట్రాలు ఈ స్వింగ్ స్టేట్స్ జాబితాలో ఉన్నాయి. వీటిలో విజయం సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు అవుతారు.  తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ స్వింగ్ స్టేట్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
మరోవైపు, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు జో బైడెన్‌ను 238 ఎలక్టోరల్ సీట్లు దక్కగా, ట్రంప్‌కు 213 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 270 సీట్లు దక్కించుకోవాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల్లో నేను గెలిచా, బైడెన్ మోసం చేసారు, సుప్రీంకోర్టుకెళ్తా: ట్రంప్