Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ ఆశలు గల్లంతు.. ఆధిక్యంలో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ ఆశలు గల్లంతు.. ఆధిక్యంలో బైడెన్
, బుధవారం, 4 నవంబరు 2020 (08:17 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది. అయితే, పోలింగ్ ముగిసిన కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 
 
తొలి ఫలితాల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ స్వల్ప అధిక్యంలో దూసుకెళ్తున్నారు. ప్రాథమిక ఫలితాల్లో బైడెన్ 8 రాష్ట్రాల్లో విజయం సాధిస్తే... రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయ కేతనం ఎగురవేశారు. ఇప్పటివరకూ బైడెన్‌కు 215, ట్రంప్‌కు 164 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, ఇప్పటివరకూ 379 ఫలితాలు వచ్చాయి. 270 ఓట్లకన్నా అధికం సాధించిన వారు వైట్ హౌస్ కు వెళతారు.
 
అంతేకాకుండా, మసాచుసెట్స్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్మంట్, డేలవర్, వర్జినియా, కనెక్టికట్, రోల్ ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించారు. ఇండియానా, కెంటుకీ, ఓక్లహోమా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియాల, మిస్సిసీపి, అలబామా, అర్కాన్సాస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. అలాగే టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌షైర్‌లలో బైడెన్ అధిక్యంలో ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకాంతంగా శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు