Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో కరోనావైరస్‌ను తుదముట్టించాలంటే ముందుగా ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలి: బైడెన్

Advertiesment
అమెరికాలో కరోనావైరస్‌ను తుదముట్టించాలంటే ముందుగా ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలి: బైడెన్
, మంగళవారం, 3 నవంబరు 2020 (09:44 IST)
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేవారెవరో తేలిపోతోంది. ఇదిలావుంటే అమెరికాలో చాలాచోట్ల ట్రంప్‌కి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బైడెన్ అమెరికన్లను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసారు. ఓటింగ్ జరుగుతుండగా డెమొక్రాటిక్ ఛాలెంజర్ బైడెన్ సోమవారం మాట్లాడుతూ... అమెరికాలో విధ్వంసాన్ని సృష్టిస్తున్న కరోనావైరస్‌ను తుదముట్టించాలంటే ముందుగా ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
 
పిట్స్‌బర్గ్ నగరంలో ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తూ... ట్రంప్ గత నాలుగు సంవత్సరాల్లో అమెరికా ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. వేలమందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్‌ను ఆపటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే..
 
"వైరస్‌ను ఓడించాలంటే ముందుగా డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలి'' అని బైడెన్ తన రెండవ ప్రసంగంలో చెప్పారు. దాదాపు 10 కోట్లకు పైగా అమెరికన్లు ఇప్పటికే ఓటు వేశారు. మంగళవారం లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... “ మీకు నేనిచ్చే సందేశం చాలా సింపుల్. అదేమిటంటే... ఈ దేశాన్ని మార్చగల శక్తి మీ చేతుల్లో ఉంది. డోనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నించినా నేను పట్టించుకోను, ఈ దేశ ప్రజలను ఓటు వేయకుండా ఆపడానికి అతను ఏమీ చేయలేడు, అతను ఎంత ప్రయత్నించినా సరే” అని అన్నారు. గత వారం ఒక పత్రికా కథనం ఇలా వుంది, ఆధునిక అధ్యక్ష చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఒక అభ్యర్థి ట్రంప్ వలె ఓటును అణచివేయడానికి విస్తృత ప్రయత్నాలపై ఆధారపడలేదని బైడెన్ చెప్పారు.
 
అమెరికన్లు ఓటు వేయడం ఆయనకు ఇష్టం లేదనీ, ధనవంతులు మాత్రమే ఓటు వేయాలని ఆయన భావిస్తున్నారని ట్రంప్ పైన మండిపడ్డారు. అమెరికా తీర్పు చాలా బిగ్గరగా వుంటుందనీ, డొనాల్డ్ ట్రంప్ తన సంచులను సర్దుకుని ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైందనీ, ట్రంప్.. ఇకచాలు ఇంటికి వెళ్ళు అంటూ బైడెన్ గర్జించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అమెరికా ఎన్నికలు : మిస్టర్ ట్రంప్.. పెట్టెబేడా సర్దుకో.. జో బైడెన్