Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ ఓడిపోవడం ఖాయమా? కానీ ఇండియన్ జ్యోతిష్యుడు అలా చెప్పాడే?

Advertiesment
ట్రంప్ ఓడిపోవడం ఖాయమా? కానీ ఇండియన్ జ్యోతిష్యుడు అలా చెప్పాడే?
, సోమవారం, 2 నవంబరు 2020 (20:08 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 3 జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం చాలా కష్టతరం అంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కానీ ఓ భారతీయ జ్యోతిష్యుడు మాత్రం ట్రంప్ మళ్లీ సింహాసనం అధిష్టించడం ఖాయమంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ సింహం, 10వ ఇంట్లో సూర్యుడిని ఉండటం మూలంగా మరోసారి కుర్చీ ఆయనదే అంటున్నారు.
 
ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని నిలుపుకుంటారని, కనీసం 4 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తారని ఆయన చెపుతున్నారు. బయట అంతా అనుకున్నట్లుగా ట్రంప్ ఓటమి అనేది వుండదని కుండబద్ధలు కొట్టనట్లు చెపుతున్నారు.
 
ఇకపోతే.. యుఎస్ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఎస్ఎస్ఆర్ఎస్ నిర్వహించిన సిఎన్ఎన్ పోల్స్ ప్రకారం, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ మరియు మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఎగువ మిడ్వెస్ట్ రాష్ట్రాలైన విస్కాన్సిన్ మరియు మిచిగాన్లలో ముందున్నారు. ఏదేమైనా, బిడెన్ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరిజోనా, నార్త్ కరోలినాలోని రాష్ట్రాల్లో తీవ్ర పోటీని చూడనున్నారు. ముఖ్యంగా, ట్రంప్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ 2016లో విజయం సాధించారు.
 
సర్వే ఫలితాల ప్రకారం, అరిజోనాలో, పోల్ ప్రకారం, బైడన్ 50 శాతం ఆధిక్యతో వుంటే ట్రంప్ 46%గా వుంది. విస్కాన్సిన్లో, బైడెన్ ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కి 44 శాతం మద్దతు వుంటే బైడెన్‌కి 52%. ఉత్తర కరోలినాలో బైడెన్ 51%, ట్రంప్ 45%. ఎటు చూసినా ముందస్తు సర్వే ఫలితాల్లో ట్రంప్ పరిస్థితి కష్టంగా వున్నట్లు తెలుస్తోంది. రేపు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,916 కరోనా కేసులు.. 13 మంది మృతి