Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఫ్లోరిడా ట్రంప్ తలరాత మార్చుతుందా..?

Advertiesment
Florida Presidential Election Results
, బుధవారం, 4 నవంబరు 2020 (11:27 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో దూసుకెళ్తూ వచ్చారు. కానీ, అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని శాసించే ఫ్లోరిడాలో మాత్రం జో బైడెన్ కాస్త వెనకబడ్డారు. ఇక్కడ ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన సత్తా చాటుతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ట్రంప్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అయినప్పటికీ.. ఎలక్టోరల్ ఓట్ల పరంగా చూస్తే జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఈయనకు ప్రస్తుతం 223 ఓట్లు పోలుకాగా, ట్రంప్‌కు 174 ఓట్లు వచ్చాయి. 
 
ఇకపోతే, ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటే తప్పక గెలవాల్సిన ఫ్లోరిడాలో ముందంజలో ఉండడం ఆయన పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక రిపబ్లికన్ పార్టీ శ్రేణులైతే ఇప్పటికే తాము ఫ్లోరిడాలో గెలిచినట్లు ప్రకటించుకుని సంబరాల్లో మునిగితేలుతున్నాయి. అలాగే 2016లో ట్రంప్‌ను అధ్యక్ష పీఠం ఎక్కించిన 'బ్లూ వాల్‌'గా పిలువబడే మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలపై బైడెన్ ఈసారి పట్టు సాధించినట్లు సమాచారం. 
 
కానీ, ఈ రాష్ట్రాల ఫలితాలు విడుదల కావటానికి సమయం పట్టనుంది. ఇక కీలక స్వింగ్ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, ఓహియో, టెక్సాస్‌ ఫలితాలు కూడా రావాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా బైడెన్ 223 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకోగా... ట్రంప్ 174 ఓట్లు పొందారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 270కు బైడెన్ దగ్గరయ్యారనే చెప్పాలి.
 
కాగా, ఇరువురు అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల వారిగా ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే...
 
డొనాల్డ్ ట్రంప్(116) :
అలబామా(09), అర్కాన్సాస్(06), ఇండియానా(11), కాన్సాస్(06), కెంటుకీ(08), మిస్సిసిప్పీ(06), మిస్సోరి(10), నెబ్రాస్కా(05), నార్త్ డకోటా(03), ఓక్లహోమా(07), సౌత్ కరోలినా(09), సౌత్ డకోటా(09), టెన్నెస్సీ(11), ఉతాహా(06), వెస్ట్ వర్జినియా(05), వ్యోమింగ్(03).
 
జో బైడెన్(209) :
కాలిఫోర్నియా(55), కోలరాడో(09), కనెక్టికట్(07), డేలావెర్(03), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(03), ఇల్లినాయిస్(20), మెరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూ హ్యాంప్‌షైర్(04), న్యూజెర్సీ(14), న్యూమెక్సికో(05), న్యూయార్క్(29), ఒరెగాన్(07), రోల్ ఐలాండ్‌(04), వెర్మాంట్(03), వర్జినియా(13), వాషింగ్టన్(12). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా కేసుల తాజా అప్డేట్స్... తెలంగాణాలో కేసులెన్ని?