Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను తన్ని తరిమేశానంటున్న పూజా హెగ్డే

Webdunia
గురువారం, 6 మే 2021 (09:47 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ఈమెకు గత నలె 25వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. తమిళ హీరో విజయ్ కొత్త చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన చిత్ర బృందంలో పూజా హెగ్డే ఒకరు. అక్కడ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఆ వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆమె తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 
 
ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో కరోనాను తన్ని తరిమేశాను. మొత్తానికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ ఆమె ఆమె ట్వీట్‌ చేసింది.
 
మరోవైపు, పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలే ఉన్నాయి. హీరో ప్రభాస్‌తో కలిసి ఆమె ‘రాధేశ్యామ్‌’లో నటించింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్‌కు జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘ఆచార్య’లోనూ ఆమె ఒక కీలకపాత్ర పోషించింది. 
 
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సరసన మరో నటిస్తోంది. ‘దళపతి 65’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో ఆమె చాలా బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments