Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతను ప్రధాని మోడీ లొంగదీసుకోవాలి : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 6 మే 2021 (09:05 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లొంగదీసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. 
 
ఎన్నికల తర్వాత బెంగాల్ రాష్ట్రంలో హింస చెలరేగింది. అధికార టీఎంసీ, బీజేపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో హింస చెలరేగింది. ఈ అల్లర్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ 2000వ సంవత్సరంలో ప్రదర్శించిన విశ్వరూపాన్ని మళ్లీ ప్రదర్శించి మమతను లొంగదీసుకోవాలని కంగన తన ట్వీట్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆ సంవత్సరంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. అనంతరం జరిగిన గోద్రా మారణకాండలో ఎంతోమంది ముస్లింలు మరణించారు. ఇప్పుడా విషయాన్ని కంగన పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ఆ పనిని మోడీనే చేయించారని ఆమె భావిస్తున్నట్టు ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె తెలిసి చేసినా, తెలియక చేసినా గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోడీపై వచ్చిన ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయని చెబుతున్నారు. 
 
అయితే, కంగనా ఈ సందర్భంగా మమతా బెనర్జీని రాక్షసితో పోల్చారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేసింది. గతంలోనూ ఆమె ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ఖాతా రద్దు కాలేదు కానీ, రద్దు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. 
 
అయితే, ఇప్పుడు మాత్రం ఆమె విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా మూసివేసింది. మరోవైపు, కంగన మాత్రం ట్విట్టర్ ఒక్కటే సర్వస్వం కాదని, తాను గొంతు విప్పేందుకు అనేక మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

తర్వాతి కథనం
Show comments