Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న `ప్లాన్ బి`

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (17:09 IST)
Srinivas reddy
శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ముఖ్య తారాగణంతో ఎవిఆర్మూ.వీ వండర్స్ పతాకం పై కెవి. రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "ప్లాన్-బి". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 23న విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ, "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠంతో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. మా చిత్రాన్నిసెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, మురళి శర్మ, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన చిత్రానికే ఒక హైలైట్అని తెలిపారు. 
 
నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదలకి ముందే మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అని తెలిపారు. 
 
కెమెరా : వెంకట్ గంగాధరి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్), ఎడిటర్ : ఆవుల వెంకటేష్, యాక్షన్ : శంకర్ ఉయ్యాల, ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్, డిటియస్ : రాధాకృష్ణ, డిఐ కలరిస్ట్ :  ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్), సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం :  కెవి రాజమహి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments