Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెద కాపు-1 ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (16:22 IST)
Peda kapu motion picture
బాలకృష్ణ తో అఖండ చిత్రాన్ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి పెద కాపు-1 టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని కూడా నిర్మాతలు ఈరోజు అనౌన్స్ చేశారు. విరాట్ కర్ణ ని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం. 
 
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కోసం పవర్ ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ 'పెద కాపు-1'ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విరాట్ కర్ణని ఇంటెన్స్, రగ్గడ్ గా ప్రెజెంట్ చేశారు. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు కర్ణ. మంచి లుక్స్ ఉన్న విరాట్ కర్ణ పర్ఫెక్ట్ మెటీరియల్. 'ఓ సామాన్యుడి సంతకం' అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షించింది.
 
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఛోటా కె నాయుడు కెమెరామెన్ కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్.
పెద కాపు-1 షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
 
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి సంగీతం - మిక్కీ జె మేయర్ డీవోపీ - చోటా కె నాయుడు
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్ ఫైట్స్: పీటర్ హెయిన్స్ కొరియోగ్రాఫర్ - రాజు సుందరం
ఆర్ట్- జియం శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments