Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా పై కూడా కన్నడ లోచాలా క్రేజ్ వుంది : దీక్షిత్ శెట్టి

Advertiesment
Dixit Shetty
, శనివారం, 11 మార్చి 2023 (17:21 IST)
Dixit Shetty
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో  కీలక పాత్ర పోషిస్తున్న దీక్షిత్ శెట్టి విలేఖరుల సమావేశంలో ‘దసరా’ విశేషాలని పంచుకున్నారు.
 
దసరా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
‘మీట్ క్యూట్’ వెబ్ సిరిస్ లో చేశాను. ‘దసరా’లో ఈ పాత్రకి ఆడిషన్ జరిగినప్పుడు మీట్ క్యూట్ లో పని చేసిన కో డైరెక్టర్ వినయ్ ఈ పాత్రకి నన్ను రిఫర్ చేశారు. అక్కడి నుంచి జర్నీ మొదలైయింది. మీట్ క్యూట్ లో నేను చేసి వర్క్ నాని గారికీ నచ్చింది. దసరాలో పాత్ర చేయగలననే నమ్మకాన్ని ఇచ్చింది.
 
నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
నాని గారితో దాదాపు పది నెలల పాటు ప్రయాణించాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని గారు ఆల్రెడీ నేచురల్ స్టార్. చాలా సహజంగా ఫెర్ ఫార్మ్ చేస్తారు. ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలవడానికి కూడా ఒక కారణం వుంది. చాలా క్రమశిక్షణ గల స్టార్ అయన. ఒక్క రోజు కూడా సెట్ కి ఆలస్యం గా రాలేదు. చెప్పిన సమయానికి పది నిమిషాలు ముందే వుంటారు. సినిమా అంటే గొప్ప ప్యాషన్. నాని గారి నుంచి చాలా స్ఫూర్తి పొందాను.
 
కీర్తి సురేష్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
 మహానటి సినిమాలో చుశాను. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అనుకోలేదు. కీర్తి సురేష్ గారితో కలసి పని చేయడం మంచి అనుభవం.
 
దసరా కన్నడలో కూడా విడుదలౌతుంది కదా.. అక్కడ బజ్ ఎలా వుంది ?
‘దసరా’ సినిమా కోసం కన్నడ ప్రేక్షకులు చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఇంకా ఎక్సయిటెడ్ గా వుంది. ఇప్పుడు సినిమాకి భాషతో అడ్డంకులు లేవు. కేజీఎఫ్ పుష్ప ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలని ఇండియన్ సినిమాగా సెలబ్రేట్ చెసుకుంటున్నాం. దసరా పై కూడా కన్నడ లోచాలా క్రేజ్ వుంది. నా విషయానికి వస్తే దియా తర్వాత థియేటర్ రిలీజ్ అవుతున్న సినిమా దసరా కావడం చాలా ఆనందంగా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నోరు విప్పితే అంతే సంగతులు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తమ్మారెడ్డి