Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అజయ్ భూపతి సౌత్ ఇండియన్ మూవీ మంగళవారం కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది

Ajay Bhupathi's  mangalavaram poster
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (18:21 IST)
Ajay Bhupathi's mangalavaram poster
'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, 'A' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. దీంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోరూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. 'మంగళవారం' టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే'' అని అన్నారు.
 
నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''మాది పాన్ ఇండియా సినిమా కాదు, సౌత్ ఇండియన్ సినిమా. 'ఆర్ఎక్స్ 100'తో అజయ్ భూపతి ఆడియన్స్‌ను ఎలా సర్‌ప్రైజ్ చేశారో, ఈ సినిమాతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ & కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల ప్రారంభించాం. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పారు. 
 
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, ఆర్ట్ : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూతద్ధం భాస్కర్‌ నారాయణ డప్పుకొట్టి చెప్పుకొనా అంటే ఎలావుంటుందో తెలుసా!