Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు భాషల్లో ఏకకాలంలో దసరా ఫోక్ మెలోడీ సాంగ్ విడుదల

Advertiesment
Dasara fock song
, బుధవారం, 8 మార్చి 2023 (17:21 IST)
Dasara fock song
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటలకు అన్ని భాషలలో అద్భుతమైన స్పందన వచ్చింది. సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్‌ లతో కూడిన ఆల్బమ్‌ ను స్కోర్ చేశారు. మూడవ సింగిల్ చమ్కీల అంగీలేసి పాట ఇప్పుడు విడుదలైంది.
 
చమ్కీల అంగీలేసి పాట ప్రతి పెళ్లిళ్ల సీజన్‌ కి సెట్ అయ్యే ఫోక్ మెలోడీ. సంతోష్ నారాయణన్ డీప్ రూటేడ్ సాంగ్ ని స్కోర్ చేశారు. ఇన్స్ట్రుమెంట్స్ ప్రామాణికతను తెలియజేస్తున్నాయి. పెళ్లిలో భార్యాభర్తలు పరస్పరం వాదులాడుకునే సొగసైన పాటిది. భార్య పాత్ర పోషించిన కీర్తి సురేష్.. తన భర్త ఎలా దుస్తులు ధరించేవాడో, పెళ్లయిన తొలినాళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో, తర్వాత  ఎంత నిర్లక్ష్యంగా మారిపోయాడో చెబుతుంది. నాని కూడా తన భార్యపై అలాంటి వాదనలే చేశాడు. ఇది ప్రతి భార్య భర్త రిలేట్ చేసుకునే పాట.
 
 చమ్కీలా అంగీలేసి పాటలో నాని దసరా బుల్లోడులా కనిపించగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది. భార్యాభర్తలకు ఒకరిపై మరొకరు ఉండే అభిప్రాయాలను కాసర్ల శ్యామ్ తన సాహిత్యంతో అందంగా ఆవిష్కరించారు. రామ్ మిరియాల, ధీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని అద్భుతంగా పాడారు.  ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ మరో ప్లస్. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌ లో అన్ని పెళ్లిళ్లలో ఈ పాట ప్లే అవుతుంది.
 
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రాఫర్.
 
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
‘దసరా’ మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట విజయం నాకెంతో సంతోషాన్నిచ్చింది, ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుంది : సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్