Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి సినిమాలు, చారిటీ గురించి, అభిరామ్, రానా, ఇండస్ట్రీ సమస్యలపై సురేష్ బాబు ఇంటర్వ్యూ

Suresh Babu
, శనివారం, 10 డిశెంబరు 2022 (18:16 IST)
Suresh Babu
విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న 'నారప్ప' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప' కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే 'నారప్ప' ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు 'నారప్ప' థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
 
డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం.
 
ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చారిటీల కోసం పని చేస్తున్నాను. విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం ఎక్కువ సమయం పని చేస్తున్నాను. పిల్లల్ని చదివిస్తే దానికి కంటే మెరుగైన అభివృద్ధి ఈదేశానికి మరొకటి వుండదని భావిస్తాను. అలాగే పర్యావరణం కోసం కూడా కొంత పని చేస్తున్నాను. ఇటివల ఒక షో కి వెళ్ళినపుడు సినిమా పరిశ్రమలో ఓ టెక్నిషియన్ కి కొంత డబ్బు చారిటీ గా ఇచ్చాం. అయితే అన్ని విభాగాలకు అసోషియేసన్స్ వున్నాయి. సంక్షేమం కంటే అందరిలో స్కిల్ ని ఎలా పెంపొందించాలనే అంశంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని భావిస్తాను. విద్య, తగిన నైపుణ్యం మెరుగైన జీవితాన్ని ఇస్తాయి.
 
నారప్ప తర్వాత చాలా అంశాలు పై మీ అభిప్రాయాన్ని చెప్పలేదు కదా ?
నిజానికి నేను తక్కువ మాట్లాడానికి ప్రయత్నిస్తాను కానీ ఎక్కువ మాట్లాడేస్తాను.(నవ్వుతూ)ప్రతి అంశంపై అందరికీ కొన్ని అభిప్రాయాలు వుంటాయి. అయితే ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు టికెట్ల రేట్లు సమావేశానికి ఎందుకు వెళ్ళలేదని బాలకృష్ణ గారు ఒక షోలో అడిగారు ఎక్కువ టికెట్ రేట్లు పెంచకూడదని నా వ్యక్తిగత నమ్మకం. కొన్ని సినిమాలకు పెంచుతారు. అది ఇండిపెండెంట్ సినిమాకి లాభం.  కానీ ఓవరాల్ గా పెంచకూడదని నా అభిప్రాయం. మధ్యతరగతి వారికి సినిమా ఎప్పుడూ అందుబాటులో వుండాలి.  కొందరు మరో లా ఆలోచిస్తారు. అవాతర్ టికెట్లు కొన్ని మల్టిఫ్లెక్స్ లో మూడు, ఐదు వేలకు అమ్ముతున్నారు. మధ్యలో ఒకసారి మల్టీ ప్లెక్స్ లో టికెట్ ధర 70 రూపాయిలు పెట్టారు. షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే రెవెన్యూ పెంచవచ్చు. అయితే ఇందులో ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. కొన్ని సార్లు చర్చలు వ్యక్తిగతంగా కూడా మారిపోతుంటాయి. అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కష్టం. అందుకే ప్రతి కంపెనీ ఒక ఇండస్ట్రీగా మారి తన నిబంధనలు ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తుంటుంది.
 
 నారప్ప సినిమా మొదట థియేటర్లోకి రాకపోవడానికి కరోనా నే కారణమా ? లేదా మంచి ఆఫర్ వలన ఓటీటీలో విడుదల చేశారా ?
కరోనా ఒక సమస్య. జనం ఎంతమంది వస్తారో అనే భయం వుండేది. ఒకవేళ జనం రాకపోతే పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం వుంది. మా పార్ట్నర్ నిర్మాత కూడా వుండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ కేవలం సురేష్ ప్రొడక్షన్ ఒక్కటే వుంటే.. పొతేపోనీ థియేటర్ లోనే విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చేవాళ్ళం. వెంకటేష్ మాత్రం దృశ్యం ఓటీటీకి ఇచ్చేసినా నారప్ప మాత్రం థియేటర్ లో విడుదల చేయమని చెప్పారు. ఫ్రాఫిట్ వచ్చింది. థియేటర్ లో విడుదల చేసుంటే ఇంకా ఎక్కువ ఫ్రాఫిట్ వచ్చేదేమో. దృశ్యం 2 హిందీ రిజల్ట్ చూసిన తర్వాత ఇలా అనిపించింది.
 
నారప్పని ఒక్క రోజు మాత్రమే థియేటర్ లో వేయడానికి కారణం ?
ఇది అమెజాన్ ఇష్యూ. నాకు పర్శనల్ రిలేషన్ షిప్ తో ఒక్క రోజు ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ వాళ్లకి వుంది. అమ్మిన వారంతా ఒక రోజు అడిగి బావున్న తర్వాత మరో వారం ఇవ్వండని అడిగితే.. వాళ్ళ బిజినెస్ కూడా జరగాలి కదా.
 
'నారప్ప' విషయంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది ?
వెంకటేష్ ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు. ఇదే పెద్ద ఛాలెంజ్. చాలా కష్టమైన యాక్షన్. వెంకటేష్ తన పెర్ ఫార్మ్మెన్స్ పట్ల చాలా తృప్తిగా వున్నారు.
 
 నారప్ప, దృశ్యం 2 థియేటర్స్ లోకి రాలేదు కదా.. ఏదైనా రిగ్రట్ ఉందా ?
చిన్న  రిగ్రేట్ వుంది. రెండు సినిమాలు బావున్నాయి. థియేటర్స్ లో బాగా ఆడేవి. డబ్బు కూడా అంతే వచ్చేదేమో. కానీ అప్పటి కరోనా సమయంలో పరిస్థితి అందోళన కరంగా వుండేది. 
 
 సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో చర్చ నడుస్తుంది..అగ్ర నిర్మాతగా మీ అభిప్రాయం ?
ఎవరి సినిమాని ఆపలేం. అన్ని సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ ఇవ్వాలి. అందరూ విడుదల చేసుకోవాలి. బెటర్ సినిమాకి బెటర్ థియేటర్లు దొరికుతాయి తప్పితే ఒకరిని ఆపే ప్రసక్తే వుండదు.
 
కరోనా తగ్గిన తర్వాత కూడా హీరోలు ఒక వైపు థియేటర్ సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటీటీలు చేస్తున్నారు ? దిన్ని ఎలా చూస్తారు ? 
వాళ్ళ కెరీర్ ని వాళ్ళు ఎలా మలుచుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఛాయిస్. వెంకటేష్ బాబు విషయానికి వస్తే..హిందీలో ఒక సినిమా ఫ్రండ్షిప్ కోసం చేస్తున్నారు.  ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. రానా తను కలిసి ఒక వెబ్ సిరిస్ చేశారు. అది ఇంగ్లీష్ లో కూడా డబ్ అవుతుంది. అది వరల్డ్ వైడ్ షో  అయ్యే ఛాన్స్ కూడా వుంది. ఆడియన్స్ నచ్చే ఎంటర్ టైన్ మెంట్ ని ఎక్కడున్నా తప్పకుండా చూస్తారు.
 
అభిరామ్ సినిమా గురించి ?
నిజానికి అభిరామ్ యాక్టర్ అవుతాడని అనుకోలేదు. నాకు చాలా వ్యాపారాలు వున్నాయి. అవి చుసుకోమంటే.,. ''తాత నన్ను యాక్టర్ అవ్వమని చెప్పారు నేను యాక్టర్ అవుతా'' అన్నాడు. కిరణ్, తేజ తో కలసి చేస్తున్నాడు. మంచి డేట్ కోసం చూస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఫైనల్ కాపీ చూడాలి.
 
కొత్త సినిమాల గురించి
కొన్ని సినిమాల పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రకటనలు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ లో శివ రాజ్ కుమార్