Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిరామ్ చిత్రంలో మెలోడీ సాంగ్ విడుదల చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ

Advertiesment
Abhiram team with Siva Nirvana
, సోమవారం, 31 అక్టోబరు 2022 (16:37 IST)
Abhiram team with Siva Nirvana
లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం లోని పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదల అవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలోని "చాల్లే చాల్లే" లిరికల్ సాంగ్ ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.
 
అనంతరం  శివ నిర్వాణ మాట్లాడుతూ..లెజెండరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో  నిర్మించిన "అభిరామ్" సినిమాలోని "చాల్లే చాల్లే" అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను చూడడం జరిగింది. ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా చాలా క్యాచీగా ఉంది. మీనాక్షి భుజంగ్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే ఈ పాటను పాడడం విశేషం.ఈ పాటలో విజువల్స్ చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్ లు చాలా బాగా చేశారు.కాబట్టి సినిమాలో కూడా బాగా చేసుంటారు అనుకుంటున్నాను.చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ బాగుంది.ఈ సినిమాకు పనిచేసిన "అభిరామ్" సినిమా టెక్నిషియన్స్ అందరికీ అల్ ద  బెస్ట్.అలాగే దర్శక, నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత జింకా శ్రీనివాసులు మాట్లాడుతూ..మీనాక్షి భుజంగ్ అద్భుతమైన సంగీతం అందిస్తూ పాడిన "చాల్లే చాల్లే" అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేసిన  దర్శకులు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు.ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పోటీపడి  నటించారు..జగదీశ్ కొమరి సినిమాటోగ్రఫీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.టిప్స్ ఆడియో మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తాయి. లవ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ కలయికతో ఒక విన్నూత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాం.అందరూ మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామకృష్ణార్జున్ మాట్లాడుతూ.. మా అభిరామ్ సినిమాలోని "చాల్లే చాల్లే" అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేసిన  దర్శకులు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు.నటే, నటులు, టెక్నిషియన్స్  అందరూ సపోర్ట్ చేయడంతో  సినిమా బాగా వచ్చింది.త్వరలో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరోజినీ నాయుడు బయోపిక్ చేయ‌బోతున్నాః బనారస్ హీరోయిన్ సోనాల్ మోంటెరో