Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డిస్కో రాజా'గా రవితేజ.. అందాల ఆరబోతకు పాయల్ రాజ్‌పుత్ 'సై'

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (14:04 IST)
తన తొలి చిత్రం 'ఆర్ఎక్స్ 100' చిత్రంలో అందాలను ఆరబోసిన సంచలనం సృష్టించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తన తొలి చిత్రం తర్వాత పాయల్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది. 
 
'ఆర్ఎక్స్ 100' చిత్రంలో ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డం వంటి పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. 
 
తాజాగా ర‌వితేజ స‌ర‌స‌న నటించే ఛాన్స్ కొట్టేసింద‌ట‌. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా , 'ఒక్క క్షణం'  వంటి చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ త్వ‌ర‌లో ర‌వితేజ‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. 'నేల టికెట్టు' నిర్మాత రవి తాళ్లూరి. ఈ చిత్రానికి "డిస్కో రాజా" అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, ఇందులో రవితేజ ద్విపాత్రాభిన‌యం పోషించ‌నున్నాడ‌ట. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తోంది. 
 
వాస్తవానికి ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంది. వీరిలో ఒకరు పాయల్ రాజ్‌పుత్ కాగా, మరొకరు 'నన్ను దోచుకుందువటే' చిత్రం ఫేమ్ నాబా నటేష్‌ కావడం గమనార్హం. మూడో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. ఎస్ఎస్. థమన్ సంగీతం అందించే ఈ చిత్రంలో హీరో కమ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రను పోషించనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments