Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపదలో ఉంటే కాపాడేది జనం కాదు.. మన మనోబలమే... ట్రిపుల్ "ఏ" టీజర్

Advertiesment
ఆపదలో ఉంటే కాపాడేది జనం కాదు.. మన మనోబలమే... ట్రిపుల్
, మంగళవారం, 30 అక్టోబరు 2018 (13:10 IST)
మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
'ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలుపెట్టాలి... మనకు నిజమైన ఆపద వచ్చినపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మన బలం' అంటూ వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'కిక్' తర్వాత ఇలియానా మరోసారి రవితేజకు జోడీగా నటిస్తోంది.
 
'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వస్తున్న రవితేజ, శ్రీనువైట్ల కాంబో మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్రలని ప‌రిచ‌యం చేస్తూ విడుదల చేసిన వీడియో అభిమానుల‌ని అలరిస్తోంది. 
 
ఈ చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకులేకుండా చేస్తోంది...