మాటల మాంత్రికుడితో బన్నీ... హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫిక్స్!

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (13:21 IST)
మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలని వారిద్దరూ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి అల్లు అర్జున్ నటించిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం విడుదల తర్వాత తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. దీనికి కారణం ఇపుడు తెలియవచ్చింది. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకే బన్నీ ఇంతకాలం వేచివున్నట్టు తేలిపోయింది. 'త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నాడని.. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని అధికారిక ప్రకటన మాత్రమే ఆలస్యం' అని వార్తలు వస్తున్నాయి.
 
అయితే, ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించాలనే విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంది. ఈ ఆ విషయం తేలిన వెంటనే బన్నీ-త్రివిక్రమ్ సినిమా‌ను లాంచ్ చేస్తారని సమాచారం. ఇదిలావుంటే ఈ సినిమా ఒక హిట్ హిందీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
ఇకపోతే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ - బోయపాటి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ - బన్నీల కాంబినేషన్‌ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో 'జులాయి'.. 'S/o సత్యమూర్తి' చిత్రాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు మూడో చిత్రంరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం.. ఇంట్లో నోట్ల కట్టలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments