Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సాయంత్రం 6 గంటలకు బుల్లితెరపై "వకీల్ సాబ్" టెలికాస్ట్

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (11:54 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం కరోనా రెండో దశ వ్యాప్తి లాక్డౌన్‌కు ముందు థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తీవ్రతరం కావడంతో థియేటర్లు మూసివేశారు. దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్ రికార్డులను తిరగరాయలేక పోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆదివారం సాయంత్రం ప్రముఖు టీవీ చానెల్‌లో ఈ చిత్రం ప్రసారం చేయనున్నారు. 
 
హిందీ పింక్ చిత్రాన్ని తెలుగు రీమేక్ "వకీల్ సాబ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా సూపర్ హిట్‌తో తక్కువ సమయంలోనే మంచి కలెక్షన్లను రాబట్టింది. విడుదలైన కొద్ది రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ‌లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 
 
అయితే తాజాగా ఈ చిత్రాన్ని జీ మీడియా గ్రూప్ శాటిలైట్ హక్కులను భారీగానే చెల్లించి కొనుగోలు చేసింది. కరోనా కారణంగా సినిమా థియేటర్స్‌లో చూడలేకపోయిన అభిమానులకు బుల్లితెరపై ఈ "వకీల్ సాబ్" సందడి చేయనున్నారు. 
 
ఇప్పటికే వెండి తెరపై రికార్డులు సృష్టించిన "వకీల్ సాబ్" త్వరలో బుల్లితెరలో టిఆర్పీ రేటింగ్‌తో మరెన్ని సంచనాలు సృష్టించబోతుందో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను జీ మీడియా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ టెలికాస్ట్ కానుంది. 
 
కాగా, ఈ నెల 23 నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. దీంతో ఈ మూవీ మళ్లీ థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలావుంటే, దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హసన్ హీరోయిన్‌గా నటించిగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతంతో ఈ సినిమాలోని పాటలు మరింత క్రేజ్ సంపాదించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై దుండగుడి పిడిగుద్దులు... మృతి!!

జగన్ ఓ అరాచకవాది .. కాంగ్రెస్‌తో చేరి మోడీ సర్కారును అస్థిపరిచేందుకు కుట్ర : బీజేపీ ఎమ్మెల్యే

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలకు వైకాపా సపోర్ట్... ఓం బిర్లాకు మద్దతు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments