ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆరోపించారు. వీరికి బాసటగా జనసేన పోరాటం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
గత 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్ విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పారని పవన్ ఆరోపించారు.