మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా `సర్కారు వారి పాట` కరోనాకుముందు దుబాయ్ ప్రాంతాల్లో ఓ బేంక్ లో షూటింగ్ జరిగింది. ఆ తర్వాత హాలీవుడ్ యాక్షన్ టీమ్‌తో కొంత ఎపిసోడ్ చేశారు. మరలా కరోనా విజృంభించడంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం వాటిని కంటెన్యూ చేస్తుంది. చిత్ర యూనిట్ ఇటీవలే మహేష్‌బాబు ఇందులో పాల్గొన్నాడు. ఆయనకు యాక్షన్ సీన్‌ను వివరిస్తున్న దర్శకుడు, ఆ పక్కనే ఆసక్తిగా చూస్తున్న నిర్మాత స్టిల్‌ను మహేష్‌బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. మొత్తం చిత్ర యూనిట్ కి మళ్ళీ కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో సూపర్ ఎనర్జీతో మేకర్స్ ఈ కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమె షెడ్యూల్ యాక్షన్ పార్ట్ అయ్యాక మొదలవుతుందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.