టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకప్‌మెన్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. నా బెస్ట్ మేకప్‌మెన్ ఈయనే అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఒక హీరోను అత్యంత అందంగా అభిమానులు ఆకట్టుకునే విధంగా చూపించేది వారి మేకప్ టీం మాత్రమే. అలాగే అదే మేకప్‌తో ఎంతో మాయాజాలం చేయగలిగే వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉన్నారు.
అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తనకి తెలిసిన ది బెస్ట్ మేకప్‌మెన్ మీరే అని తన పర్సనల్ మేకప్‌మెన్ పట్టాబి గురించి కొనియాడారు. అయితే ఈరోజు అయన బర్త్ డే సందర్భంగా తన సినిమా 'ఖలేజా' నాటి వర్కింగ్ స్టిల్ పెట్టి మహేష్ ఈ రకంగా తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.
అలాగే తన ప్రేమ గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ తెలిపారు. మరి ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చేస్తుండగా అలాగే తర్వాత త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ సినిమాకు సన్నద్ధం అవుతున్నారు.