ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ తొలి పోస్ట్... నెట్టింట వైరల్.. ఏం పెట్టారో తెలుసా?

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (12:57 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఖాతాను ఓపెన్ చేశారు. అలా ఖాతా ఓపెన్ చేశారో లేదో గానీ, ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య నిమిషాల్లో లక్షలకు చేరిపోయింది. జూన్ నాలుగో తేదీన ఇన్‌స్టా ఖాతాను తెరిచిన ఆయన తొలి పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. 
 
'ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!' అనే స్లోగన్‌తో ఇన్‌స్టాలోకి పవన్‌ కల్యాణ్ అడుగు పెట్టాగా, ఆయన తొలి పోస్ట్‌ ఏం పెడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయపరమైన ఫొటోలు పెడతారా.. లేదంటే సినిమా విశేషాలు పంచుకుంటారా.. అని అందరూ ఎదురుచూశారు. 
 
తాజాగా ఆయన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. ఆయన చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సినీ ప్రముఖులతోటి దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 
 
"చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను" అని ఆ వీడియో ప్రారంభమైంది. దీనికి "మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ.." అని క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు షేర్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments