Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో డైవ్ పేరుతో వీఆర్ హెడ్ సెట్.. ఫీచర్స్ ఇవే...

JIo VR headset
, బుధవారం, 3 మే 2023 (22:28 IST)
JIo VR headset
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. అత్యధిక కస్టమర్లను పొందిన జియో.. తాజాగా జియో డైవ్ పేరుతో మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్ సెట్‌ను లాంచ్ చేసింది. స్టేడియం 360 డిగ్రీల వీక్షణతో వర్చువల్ 100-అంగుళాల స్క్రీన్‌పై ఆన్‌లైన్ ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఆస్వాదించడానికి కొత్త పరికరంగా ఇది ఉపయోగించబడుతుంది. 
 
వినియోగదారులు మరింత ఇమ్మర్సివ్ అనుభూతి కోసం పరికరంలోని ఇతర వీడియోలను కూడా చూడవచ్చు. జియోడైవ్ అనేది స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత విఆర్ హెడ్‌సెట్. ఇది జియోసినిమా యాప్‌తో పనిచేస్తుంది. ఇది వివిధ కెమెరా యాంగిల్స్, బహుళ భాషలు వంటి ఫీచర్లను అందిస్తుంది. 
 
భవిష్యత్తులో మరింత అధునాతన ఫీచర్లను అందిస్తామని హామీ ఇస్తూ జియో ఇప్పటికే జియో గ్లాస్‌ను ప్రకటించింది. తాజాగా రిలయన్స్ జియో విజన్‌లో భాగంగా కొత్త వీఆర్ హెడ్ సెట్‌ను రూపొందించారు.
 
జియోడైవ్ వీఆర్ హెడ్ సెట్ ధర రూ.1,299 కాగా, ఇది బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. వినియోగదారులు ఈ హెడ్ సెట్ ను జియో అధికారిక వెబ్ సైట్ లేదా జియోమార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. పేటీఎం వాలెట్‌పై చేసే ఆర్డర్లపై జియో రూ.500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. 
 
జియో వీఆర్ హెడ్ సెట్ ఫీచర్లు
జియోడివ్ వీఆర్ హెడ్ సెట్ ప్రత్యేకంగా జియో యూజర్ల కోసం అందుబాటులో ఉంది. ఇది 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్‌పై జియోసినిమాలో టాటా ఐపిఎల్‌ను వీక్షించడానికి అనుమతిస్తుంది. 4.7 నుంచి 6.7 అంగుళాల డిస్‌ప్లే పరిమాణం కలిగిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ల‌కు ఈ హెడ్సెట్ సపోర్ట్ చేస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో కస్టమర్ల కోసం జియో ఫైబర్...