Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విప్లవాత్మక ఫీచర్లతో భావి తరపు స్మార్ట్‌ ఏసీలను విడుదల చేసిన హైసెన్స్‌ ఇండియా

Advertiesment
AC
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:49 IST)
కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్- అప్లయెన్సస్‌లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ హైసెన్స్‌, తమ తాజా ఎయిర్‌ కండిషనర్స్‌, ఇంటెల్లి ప్రొ, కూలింగ్‌ఎక్స్‌పర్ట్‌‌తో భారతీయ మార్కెట్‌ను విప్లవాత్మీకరించడానికి సిద్ధమైంది. అత్యధిక ఫీచర్లు కలిగిన ఏసీలు విస్తృత శ్రేణి ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో వైఫై వాయిస్‌ కంట్రోల్‌, 5 ఇన్‌ 1 కన్వర్టబల్‌ ప్రో- మరెన్నో ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇవి కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారెంటీతో వస్తాయి. ఇంటెల్లిప్రో- కూలింగ్‌ ఎక్స్‌పర్ట్‌1టన్‌ మరియు 2టన్‌ సామర్థ్యంతో వస్తాయి. ఇవి 31వేల రూపాయల ప్రారంభ ధరతో వస్తాయి. ఇవి భారతదేశవ్యాప్తంగా సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ స్టోర్ల వ్యాప్తంగా లభిస్తాయి.
 
ఈ సందర్భంగా హైసెన్స్‌ ఇండియా ఎండీ స్టీవెన్‌ లి మాట్లాడుతూ, ‘‘భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు విభిన్న విభాగాలలో వినూత్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తీసుకురావడంపై హైసెన్స్‌ ఇండియా దృష్టిసారిస్తుంది.  ఇంటెల్లి ప్రో మరియు కూలింగ్‌ఎక్స్‌పర్ట్‌ ఎయిర్‌కండీషనర్ల ఆవిష్కరణ ఆ నిబద్ధతకు కొనసాగింపు, ఇంటి వద్ద సాటిలేని సౌకర్యంను వినియోగదారులకు అందించే దిశగా ఓ ముందడుగు.

ఏసీ యొక్క వినూత్నమైన ఫీచర్లు వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించడం మాత్రమే కాదు విద్యుత్‌ ఆదా చేసి, ఆరోగ్యవంతమైన గృహ వాతావరణమూ అందిస్తుంది. పలు విభాగాలలో ప్రపంచశ్రేణి ఉత్పత్తులను తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజయ్ పాల్ సింగ్ బంగా: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' విద్యార్ధి నుంచి ప్రపంచ బ్యాంకు వరకు..