Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే ఫ్యాన్స్ హింస పెడుతున్నారు... మొబైల్‌ను కూడా వాడలేక పోతున్నా : మహేష్ కత్తి

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:39 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నాడు. పీకే ఫ్యాన్స్ త‌మ మూర్ఖ‌త్వంతో త‌న‌ను దేశవ్యాప్తంగా పాప్యుల‌ర్ చేస్తున్నార‌న్నారు. 
 
తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని అక్కడ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి... ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో హీరో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన పీకే ఫ్యాన్స్, అప్పటి నుంచి మహేష్ కత్తితో సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన గురించి ఓ జాతీయ ఛానెల్లో వచ్చిన వార్తకు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌న‌ను ఎలా వేధిస్తున్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న సాక్ష్యాల‌తో స‌హా చూపించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు నిమిషానికి 10 ఫోన్ కాల్స్ చేస్తున్నార‌ని, రోజంతా ఇదే తీరు అని, దీంతో త‌న మొబైల్‌ను కూడా తాను ఉప‌యోగించుకోలేక‌పోతున్నాన‌ని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments