Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమానంతో నా భర్త వేధిస్తున్నాడు : నటుడిపై కేసు పెట్టిన భార్య?

సంసారం అనేది భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంపై ఆధారపడివుంటుంది. ఇరువురి మధ్య ఆ నమ్మకమే లేనపుడు వారి దాంపత్య జీవితమేకాకుండా సంసారం కూడా అభాసుపాలవుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. తన

Advertiesment
అనుమానంతో నా భర్త వేధిస్తున్నాడు : నటుడిపై కేసు పెట్టిన భార్య?
, బుధవారం, 24 మే 2017 (07:33 IST)
సంసారం అనేది భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంపై ఆధారపడివుంటుంది. ఇరువురి మధ్య ఆ నమ్మకమే లేనపుడు వారి దాంపత్య జీవితమేకాకుండా సంసారం కూడా అభాసుపాలవుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. తన భర్త అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడంటూ ఓ నటుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తమిళ సినిమాలు, టీవీ సీరియల్స్‌, రియాల్టీ షోలతో పాపులర్‌ అయిన నటుడు బాలాజీ (37). ఈయన ఎనిమిదేళ్ళ క్రితం నిత్య (30) అనే మహిళను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై నగర శివారు ప్రాంతమైన మాధవరంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప ఉంది. సజావుగా సాగుతున్న వారి సంసారం కొన్ని నెలలుగా ఇబ్బందుల్లో పడింది. భార్యాభర్తలిద్దరి నడుమ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. 
 
తనపై అనుమానంతో బాలాజీ తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసిస్తున్నాడని నిత్య గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తనను బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని కూడా నిత్య పేర్కొంది. బాలాజీ కన్నడ బ్రాహ్మణుడు కాగా, నిత్య దళిత కులానికి చెందిన అమ్మాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురి వద్ద విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేదరికమే ద్వేషానికి కారణమని తెలిశాక అమ్మానాన్న మరింత అర్థమయ్యారు: పరిణీతి చోప్రా