Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్ముడు కత్తి మహేష్.. సూర్యుడి వైపు చూడొద్దు.. మాడి మసైపోతావ్.. బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గురించి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబుతున్నారు. మరి పబ్లిక్ పంక్షన్లకు ఖర్చు పెట్టేంద

Advertiesment
తమ్ముడు కత్తి మహేష్.. సూర్యుడి వైపు చూడొద్దు.. మాడి మసైపోతావ్.. బండ్ల గణేష్
, బుధవారం, 30 ఆగస్టు 2017 (11:29 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గురించి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబుతున్నారు. మరి పబ్లిక్ పంక్షన్లకు ఖర్చు పెట్టేందుకు డబ్బెలా వస్తుందని అడిగాడు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ నటన, రాజకీయ జీవితం, అతని అభిమానుల తీరుపై కత్తి మహేష్ చాలా విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో కత్తి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్‌కు భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్ స్పందించారు.
 
తమ్ముడూ కత్తి మహేష్.. సూర్యుడి వైపు చూడొద్దు..ఆ సూర్య కిరణాలమైన తమలాంటి వారిచే మాడి మసైపోతావ్ అంటూ ట్వీట్ చేశారు. నీతి, నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవన్ కల్యాణ్‌కు రాదని మరో అభిమాని చేసిన ట్వీట్‌ను బండ్ల గణేష్ రీట్వీట్ చేశారు. సూర్యుడి గురించి, ఆయన శక్తి గురించి ఆలోచించే బుర్ర కత్తి మహేష్‌కు లేదని.. అందుకే అర్హతకు మించి మాట్లాడుతున్నట్లు మరో అభిమాని చేసిన ట్వీట్‌ను బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశారు. 
 
మహేష్ కత్తి తన సినిమా రివ్యూల్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలను విమర్శిస్తుండటంతో మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కొందరు అభిమానులు మహేష్ కత్తి పట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మీడియా ముందుకొచ్చిన మహేష్ కత్తి.... పవన్ కళ్యాణ్‌ అభిమానులను, వారిని కంట్రోల్ చేయలేకపోతేన్న పవన్ కళ్యాణ్‌‌పై విమర్శలు గుప్పించాడు. మంచి కథలు, డైలాగులు రాసుకో, మంచి సినిమాలు తీసుకో.. ఆల్ ది బెస్ట్ అంటూ కత్తి బండ్ల గణేష్ పంచ్ ఇచ్చాడు. ఇందుకు కత్తి మహేష్ ఏరకంగా స్పందిస్తాడో వేచి చూడాలి. 
 
కాగా గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేష్‌ల మధ్య వార్ జరుగుతోంది. ఆ యుద్ధానికి సోషల్ మీడియా వేదికైంది. పవన్‌పై విమర్శలు, రాజకీయ జీవితంపై సెటైర్లు వేసిన కత్తి మహేష్‌పై పవన్ ఫ్యాన్సుకు విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతిలో చేయివేసి లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ షాపింగ్ (Rare Exclusive Video)