Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక పెళ్లి సందడి : పవన్ రాకతో సందడే సందడి...

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (08:19 IST)
మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశం ఉదయ్ పూర్‌ కోట (ప్యాలెస్)లో బుధవారం జరుగనుంది. ఈ పెళ్లి వేడుక కోసం ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు రెండూ ఇప్పటికే అక్కడికే చేరుకున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు, ఇతర కుటుంబ సభ్యులంతా అక్కడకు ప్రత్యేక విమానాల్లో ఆదివారమే చేరుకున్నారు. 
 
కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మంగళవారం సాయంత్రానికి ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఆయన వెంట తన కుమారుడు అకీరా, అద్యలు ఉన్నారు. వీరిద్దరిని తీసుకుని ఆయన ప్రత్యేక జెట్ విమానంలో రాజస్థాన్‌కు చేరుకున్నారు. పెళ్లి జరిగే ప్రాంతానికి పవన్ తన ఇద్దరు పిల్లలతో చేరుకోగానే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ వేడుకలో సందడే సందడి నెలకొంది. 
 
నిజానికి ఈ పెళ్ళి కోసం మెగా ఫ్యామిలీ అంతా రెండు రోజులు ముందుగానే చేరుకుంది. వారిలో పవన్ కళ్యాణ్ లేరు. దీంతో నిహారిక పెళ్లికి పవన్ వస్తాడా? రాడా? అన్న సందేహం నెలకొంది. అయితే, ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తూ పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయ్ పూర్‌లో ల్యాండయ్యారు. 
 
ఓ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ రాకతో ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాగబాబు తన సోదరుడు పవన్‌ను వెంటబెట్టుకుని ప్యాలెస్ పరిసరాలను చూపించారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. 
 
కాగా, నిహారిక పెళ్లి బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. వరుడు గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు చైతన్య. ఈ పెళ్లికోసం కొన్నిరోజుల ముందే ఉదయ్ పూర్ చేరుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంగీత్, ఇతర కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, అల్లు అరవింద్, ఉపాసన, స్నేహారెడ్డి... ఇలా మెగాఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్‌లోనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments