Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిణీతి చోప్రాలో ఇంత మార్పా.. ఎలా అబ్బా...?

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (18:39 IST)
మేనేజర్ స్థాయి నుంచి హీరోయిన్ వరకు ఎదిగింది పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలతో నెట్టుకొస్తున్న పరిణీతి అందాల ఆరబోత విషయంలో మాత్రం అస్సలు ఆగడం లేదట.  తన అందాలను ఆరబోస్తూ యువప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది పరిణీతి.
 
ఒక‌ప్పుడు బండ‌గా, బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు మెరుపుతీగ‌కు చెల్లిగా త‌యారైంది. కేవ‌లం ఏడాది గ్యాప్ లోనే అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేని విధంగా రెడీ అయిపోయింది ప‌రిణీతి చోప్రా. య‌శ్ రాజ్ సంస్థ పిఆర్వో గా కెరీర్ మొద‌లుపెట్టి.. అదే సంస్థ నిర్మించిన లేడీస్ వ‌ర్సెస్ రిక్కీబెల్ తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది ప‌రిణీతి. 
 
మొద‌ట్లో కాస్త బ‌క్క‌గానే ఉన్న ఈ బ్యూటీ. ఆ తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్ టైమ్ కు బాగా బొద్దుగా మారిపోయింది. లావుగా ఉండ‌టంతో కొన్ని అవ‌కాశాలు చేజారిపోయాయి కూడా. కానీ ప‌రిణీతి మాత్రం త‌న‌కిలా ఉండ‌ట‌మే ఇష్ట‌మంటూ క‌టింగ్స్ ఇస్తోందట. కానీ అవ‌కాశాలు మ‌రీ నెమ్మ‌దించ‌డంతో ఈమె స‌న్న‌బ‌డ‌క త‌ప్ప‌లేదు. కేవ‌లం ఏడాది గ్యాప్ లోనే ఒంట్లో కొవ్వునంత క‌రిగించేసిందట.
 
బాగా స‌న్న‌గా మారిపోయింది.  మెరుపుతీగ లాంటి పోజుల‌తో చిత్తుచేస్తుందట పరిణీతి. స్టార్ హీరోలు కూడా పిలిచి ఆఫ‌ర్లు ఇచ్చే స్టేజ్ కి వెళ్ళిపోయిందట. షూటింగ్స్ లో ఖాళీ సమయం దొరికినపుడు  అందాలన్నీ ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడం అలవాటుగా మార్చుకున్న పరిణీతి తన ఫోటోలను ఇన్ స్ట్రా గ్రాంలో పోస్ట్ లు చేసేస్తోందట. 
 
తనకు ఫోటోలు తీసుకోవడం సరదా అంటోంది పరిణీతి. అందుకే హాట్ ఫోటోషూట్స్ వరసగా చేస్తోందట. తాజాగా మల్దీవ్స్ వెళ్లి ఆమె బికినీ ఫోటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు తెగ చూసేస్తూ అమ్మడుకు బాగున్నాయంటూ సందేశాలిచ్చేస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments